logo
Published : 27/11/2021 03:17 IST

మెరుగైన సదుపాయాల కల్పనే లక్ష్యం


వికారాబాద్‌ రైల్వేక్వార్టర్స్‌లో పిల్లల పార్కును ప్రారంభించి, చాక్లెట్లు పంచిపెడుతున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా

తాండూరు టౌన్‌, (న్యూస్‌టుడే): ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పించడమే ప్రధాన లక్ష్యమని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజరు గజాననా మాల్యా అన్నారు. శుక్రవారం ఆయన తాండూరు రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. రైల్వే కాలనీలో ఏర్పాటు చేసిన పిల్లల ఉద్యానవనాన్ని ప్రారంభించారు. టీకాస్‌ ప్రయోగం, విద్యుత్తు సరఫరా వ్యవస్థతీరు, ఇంజినీరింగ్‌, వాణిజ్య విభాగం, సిగ్నలింగ్‌, కమ్యూనికేషన్‌ విభాగానికి చెందిన ప్రదర్శనశాలలను పరిశీలించారు. వాటి పనితీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. సికింద్రాబాద్‌ నుంచి వికారాబాద్‌ పర్లీ, పర్బనీ మార్గాల్లో టీకాస్‌ ప్రయోగాలు నిర్వహిస్తున్నామన్నారు. రిజర్వేషన్‌ రహిత టికెట్ల జారీ ప్రారంభించామని, అధికంగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడిపిస్తున్నట్లు తెలిపారు. స్టేషన్లలో ప్రయాణికుల అవసరాలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైల్వే ట్రాక్‌లతో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు వంతెనల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. సికింద్రాబాద్‌ డివిజన్‌లోని అన్ని స్టేషన్ల కంటే తాండూరులోనే అధికంగా పనులు చేపట్టామన్నారు. రైల్వే ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు జారీ చేశామన్నారు. సమస్యలపై పురపాలక సంఘం అధ్యక్షురాలు స్వప్న, పట్టణ వాసులు జీఎంకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఎం ఏకే గుప్తా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం

వికారాబాద్‌ మున్సిపాలిటీ: వికారాబాద్‌ రైల్వే జంక్షన్‌ను పరిశీలించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జీఎం గజానన్‌ మాల్యా పాల్గొన్నారు. స్టేషన్‌ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన అతిపెద్ద జాతీయ జెండాను ప్రారంభించారు. రైల్వే కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన చిన్న పిల్లల పార్కును ప్రారంభించి పిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టారు. ఆయన వెంట ఆయా విభాగాల ముఖ్య అధికారులు స్టేషన్‌ మేనేజర్‌ దేవేందర్‌రావు, ఆర్‌ఫీఎఫ్‌ సీఐ క్రాంతికుమార్‌, రైల్వే సీఐ వెంకట్రాంనాయక్‌ ఉన్నారు. పలు రైల్యే సమస్యలను వికారాబాద్‌, చేవెళ్ల ఎమ్మెల్యేలు ఆనంద్‌, యాదయ్య జీఏం గజానన్‌ మాల్యా దృష్టికి తెచ్చారు. వికారాబాద్‌లో కొత్తగా రైల్వే బ్రిడ్జిని నిర్మించాలని ఆనంద్‌ కోరారు. గొల్లగూడ, ముబారక్‌పూర్‌ వద్ద ఆర్‌ఓబీని నిర్మించాలని యాదయ్య కోరారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని