logo
Published : 01/12/2021 03:54 IST

సుందరీకరణ.. సుదూరం

న్యూస్‌టుడే, తాండూరు

ఇందిరా చౌక్‌ నుంచి విలియమ్‌ మూన్‌ కూడలి వరకు ఆగిపోయిన పనులు

పట్టణంలో ప్రధాన దారులను విస్తరించి ప్రజల రాకపోకలు సవ్యంగా జరిగేలా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. పూర్తయిన రోడ్ల మధ్యలో విభాగిణులను ఏర్పాటు చేసి మొక్కలు పెంచి ఆహ్లాదాన్ని పంచాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన రూ.32 కోట్లు మంజూరయ్యాయి. వీటితో మొత్తం అయిదు ప్రధాన రహదారులను నిర్మించాల్సి ఉండగా మూడు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన రెండింటిలో ఒకదానిని అసంపూర్తిగా వదిలేశారు. మరో మార్గం మధ్యలో విభాగిణికి సంబంధించిన పనులు ఎక్కడికక్కడే అన్నట్లుగా ఉన్నాయి.

రైల్వేస్టేషన్‌ రోడ్డులో విభాగిణి ఏర్పాటుకు వదిలిన స్థలం

ఏడాదిన్నరకే పూర్తి కావాల్సి ఉన్నా..
రోడ్డు విస్తరణ పనులు 2018లో ప్రారంభించి, ఏడాదిన్నరకే పూర్తి చేయాలని కార్యాచరణ రూపొందించారు. అమలుకు నోచలేదు. మరో వైపు సుందరీకరణలో భాగంగా దారుల విస్తరణ, విభాగిణుల నిర్మాణానికి చేపట్టిన పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. దీంతో రహదారులు అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందిరాచౌక్‌ నుంచి రైల్వేస్టేషన్‌ వరకు ఉన్న రోడ్డును 60 నుంచి 80 అడుగులు విస్తరించాల్సి ఉంది. ఈ సందర్భంగా వ్యాపార, వాణిజ్య దుకాణాలను తొలగించేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు మార్కింగ్‌ చేశారు. 40 దుకాణాలు కోల్పోయే యజమానులకు రూ.3.20 కోట్లు పరిహారం చెల్లించేందుకు సర్కారు అంగీకరించింది. ే ఆ పరిహారం సరిపోదంటూ దుకాణాల యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి దుకాణాలను తొలగించకుండా స్టే తెచ్చుకున్నారు. దీంతో ప్రారంభమైన రహదారి పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి.  దారి మధ్యలో విభాగిణి నిర్మాణానికి వదిలిన స్థలం గుంతలుగా మారి, రాకపోకల సమయంలో వాహనదారులు అవస్థలు పడుతునన్నారు. ఒక్కో సారి వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి.

రూ.కోటితో చేపట్టినవి అంతే..: తాండూరులో విలియమ్‌మూన్‌ కూడలి నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు దారిని విస్తరించారు.  ఇక్కడే రూ.కోటి వ్యయంతో విభాగిణి నిర్మాణంతో పాటు వెలుగు జిలుగులకు ప్రత్యేక స్తంభాలను ఏర్పాటు చేసి దీపాలను అమర్చాలి. అక్కడక్కడా అలంకరణ మొక్కలు నాటాలి. అయితే ఇప్పటి వరకు కేవలం విభాగిణి మాత్రమే పూర్తయింది. దిమ్మెలను ఏర్పాటు చేసినా, స్తంభాలను ఏర్పాటు చేయలేదు. మొక్కల ఊసే లేదు.
చించోళి రోడ్డు అభివృద్ధికి: ఇందిరా చౌక్‌ నుంచి రైల్వే స్టేషన్‌ వరకు చేపట్టే రోడ్డు నిర్మాణం ఆగిపోవడంతో ఇందుకు వ్యయం చేసే రూ.2.20 కోట్లను చించోళి రోడ్డుకు ఖర్చు చేసేందుకు రహదారులు, భవనాల శాఖ నిర్ణయించింది. ఇవే నిధులకు మరో రూ.3.30 కోట్లు కావాలని పేర్కొంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దస్త్రానికి ఇంకా మోక్షం లభించలేదు. నిధులు మంజూరైతే ఇందిరా చౌక్‌ నుంచి సెంట్‌మార్క్స్‌ ఉన్నత పాఠశాల వరకు ఉన్న తారు రోడ్డును పూర్తిగా తొలగించి సిమెంటు రోడ్డుగా మార్చాలి, మధ్యలో విభాగిణి ఏర్పాటు చేసి అలంకరణ మొక్కలను పెంచాలన్నది లక్ష్యం. ప్రస్తుతం తారు రోడ్డు గుంతలు పడింది.

 


 

మూడు నెలల్లో పూర్తి చేస్తాం

రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్యే, తాండూరు
రహదారుల నిర్మాణాలను మూడు నెలల్లో పూర్తి చేస్తాం. ఇందిరా చౌక్‌ నుంచి రైల్వే స్టేషన్‌ వరకు రూ.2.20 కోట్లతో చేపట్టే రోడ్డు పనులను ప్రస్తుతం ఉన్నంత వరకే ఆపేస్తాం. విభాగిణి నిర్మాణ స్థలాన్ని రహదారికి అనుసంధానిస్తాం.ఈ నిధులను కొత్తగా మంజూరయ్యే రూ.3.30 కోట్లతో కలిపి ఇందిరా చౌక్‌ నుంచి చించోళి రోడ్డు మార్గంలోని సెంట్‌మార్క్స్‌ ఉన్నత పాఠశాల వరకు ఉన్న రహదారిని అభివృద్ధి చేస్తాం. మలి దశలో ఇందిరా చౌక్‌ నుంచి ప్లైవోవర్‌ వరకు ఉన్న దారి పనులు చేపడతాం.


 

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని