logo

‘తెలుగు అకాడమీ’ నిందితులకు ముగిసిన కస్టడీ

తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడు సాయికుమార్‌ సహా ఆరుగురిని సీసీఎస్‌ పోలీసులు శనివారం చంచల్‌గూడ జైలుకు తరలించారు. కోర్టు అనుమతిలో

Published : 05 Dec 2021 01:50 IST

ఈనాడు,హైదరాబాద్‌: తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడు సాయికుమార్‌ సహా ఆరుగురిని సీసీఎస్‌ పోలీసులు శనివారం చంచల్‌గూడ జైలుకు తరలించారు. కోర్టు అనుమతిలో రెండు రోజులపాటు ఆరుగురిని విచారించారు. తెలుగు అకాడమీ నిధుల నుంచి కాజేసిన రూ.64.5 కోట్లతో స్థిరాస్తులు కొనుగోలు చేశారన్న సమాచారంతో వారిని ప్రశ్నించారు. సూత్రధారి సాయికుమార్‌ తాను ఎలాంటి ఆస్తులు కొనలేదని, ఇంకా అప్పులున్నాయని పోలీసులకు చెప్పాడు. డాక్టర్‌ వెంకట్‌, సోమశేఖర్‌, తెలుగు అకాడమీ ఏవో రమేష్‌లను విచారించిన పోలీసులు వారిచ్చిన సమాచారం ఆధారంగా మరో రూ.4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

ముగ్గురికి తాఖీదులు.. సాయికుమార్‌కు సహకరించారన్న ఆధారాలతో సీసీఎస్‌ పోలీసులు రెండు రోజుల క్రితం మరో ముగ్గురిని పిలిపించి 41 సీఆర్‌సీపీ ప్రకారం నోటీసులు ఇచ్చి పంపించారు. హైదరాబాద్‌ దాటి వెళ్లకూడదని ఆదేశించారు. ఈ కుంభకోణం దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఏసీపీ మనోజ్‌కుమార్‌ బృందం ఇప్పటి వరకు నిందితుల నుంచి రూ.21 కోట్లు స్వాధీనం చేసుకుంది. రూ.17 కోట్ల విలువైన ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాలు, రూ.4 కోట్ల నగదు ఉన్నాయని పోలీసులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని