logo

అవుటర్‌ చుట్టూ జలాభిషేకం!

అవుటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలోని అన్ని ప్రాంతాల్లో తాగునీరు అందించే కార్యాచరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే ఫేజ్‌-1లో 196 గ్రామాలకు తాగునీటిని అందించిన జలమండలి.. తాజాగా రూ.1200

Updated : 27 Jan 2022 05:10 IST

రూ.1200 కోట్ల ప్రాజెక్టు పనులకు శ్రీకారం

ఏడాదిలో పూర్తికి జలమండలి ప్రణాళిక

ఈనాడు, హైదరాబాద్‌

అవుటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలోని అన్ని ప్రాంతాల్లో తాగునీరు అందించే కార్యాచరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే ఫేజ్‌-1లో 196 గ్రామాలకు తాగునీటిని అందించిన జలమండలి.. తాజాగా రూ.1200 కోట్లతో ఫేజ్‌-2 పనులకు శ్రీకారం చుట్టింది. వీటిని సోమవారం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు స్వరూపం, విశేషాలివీ.. క్లుప్తంగా...

ఇవీ ప్రయోజనాలు

● ఓఆర్‌ఆర్‌ 158 కి.మీ. పరిధిలో విస్తరించి ఉంది. తాజా ప్రాజెక్టుతో ఓఆర్‌ఆర్‌ పరిధిలోని ప్రాంతాల ప్రజలకు సరిపడా నీటి సరఫరా సాధ్యమవుతుంది. * ఇంతవరకు సరఫరా లేని కాలనీలు, గ్రామాలకు తాగునీరు అందించవచ్ఛు దీంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. * ప్రధాన నగరంపై ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా కాలుష్యం, ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. * శివారు ప్రాంతాలకు ప్రజా రవాణా, ఇతర మౌలిక వసతులు పెరుగుతాయి.

* కొత్త పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, పర్యాటక ప్రాంతాలు ఇతర సంస్థలు కొలువుదీరే అవకాశం ఉంటుంది. * ప్రస్తుతం 3-5 రోజులకు నీళ్లు అందుతున్న ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ద్వారా రోజు విడిచి రోజు అందించవచ్ఛు * నీటి సరఫరాలో నాణ్యత పెరుగుతుంది.

కొత్తగా జారీ చేసే నల్లాలు 2,09,870

ప్రాజెక్టు తర్వాత రోజుకు తలసరి సరఫరా 150 లీటర్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని