logo

ఇంటి వద్దకే బ్యాంకు సేవలు!

చక్రాల కుర్చీలో కూర్చున్న ఈ వ్యక్తి పేరు ఎ.రామకృష్ణ. చిన్నతనంలో పోలియోతో నడవలేని పరిస్థితి. తర్వాత పెరాలసిస్‌తో మాట్లాడలేని ధీనస్థితి. చిన్నతనంలో నడవలేకపోయినా కొబ్బరి బోండాలు అమ్ముతూ చిన్న, చిన్న ఏజెంటు పనులు చేసేవాడు.

Published : 19 May 2022 02:11 IST

ఈనాడు, హైదరాబాద్‌

చక్రాల కుర్చీలో కూర్చున్న ఈ వ్యక్తి పేరు ఎ.రామకృష్ణ. చిన్నతనంలో పోలియోతో నడవలేని పరిస్థితి. తర్వాత పెరాలసిస్‌తో మాట్లాడలేని ధీనస్థితి. చిన్నతనంలో నడవలేకపోయినా కొబ్బరి బోండాలు అమ్ముతూ చిన్న, చిన్న ఏజెంటు పనులు చేసేవాడు. ఈక్రమంలో మూడు సంవత్సరాల క్రితం పక్షవాతం వల్ల పూర్తిగా నడవలేని స్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఇతనికి వికలాంగుల పెన్షన్‌ ఆధారం. కుటుంబ సభ్యులు ఆ డబ్బులు తీసుకునేందుకు చక్రాల కుర్చీలో బ్యాంకుకు తీసుకువచ్చి డబ్బు విత్‌డ్రా చేసుకుని వెళ్తారు. ఆ కుర్చీ కూడా వారిది కాదు. పక్కవారిని అడిగి తెచ్చుకుంటారు. నెలనెలా పెన్షన్‌ కోసం ఇలా బ్యాంకు వరకు తీసుకెళ్లి రావడం ప్రయాసగా మారింది.

అత్యవసర సేవలు..
సాధారణంగా ఇలాంటి సేవలు పొందాలనుకునేవారు ఎలాంటి ప్రయాస లేకుండా ఏటీఎం కార్డు లేదా చెక్కుబుక్‌ వాడతారు. అయితే అభద్రతా భావానికి లోనవుతున్న కొందరు వృద్ధులు, దివ్యాంగులు నేరుగా బ్యాంకుకు వెళ్లి సేవలు పొందుతున్నారు. అయితే ఇలాంటి వారి కోసమే కొన్ని బ్యాంకులు ‘డోర్‌ స్టెప్‌ బ్యాంకింగ్‌’ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చాయి కొన్ని బ్యాంకులు. బ్యాంకు అధికారులే వచ్చిన నగదు డిపాజిట్‌, ఉపసంహరణ, చెక్‌బుక్‌, చెక్‌ డిపాజిట్‌, స్టేట్‌మెంట్‌ సంబంధిత, టీడీఎస్‌, ఫార్మ్‌-15, టర్మ్‌ డిపాజిట్‌, కేవైసీ డాక్యుమెంట్‌ సర్వీసులను అందిస్తున్నారు. ఐదు కిలోమీటర్ల పరిధిలో ఈ సేవలను అందిస్తున్నారు. ఇందుకు కొంత సర్వీస్‌ ఛార్జీ తీసుకుంటున్నాయి.

వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు..
ఇప్పటికే 12 ప్రభుత్వ బ్యాంకులు ఒక కన్సార్టియంగా కలిసి డోర్‌ స్టెప్‌ బ్యాంకింగ్‌ సర్వీసెస్‌(డీఎస్‌పీ) పోర్టల్‌ను తీసుకొచ్చాయి. వీటితో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్బీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, కోటక్‌ మహీంద్రా బ్యాంకు వంటి ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంకులు కూడా ఇంటి వద్దకే బ్యాంక్‌ సర్వీస్‌లు ఇస్తున్నాయి. తమ హోమ్‌ బ్రాంచ్‌ డోర్‌ స్టెప్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌లను అందిస్తుందో? లేదో? వినియోగదారులు బ్యాంకుల వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన వివరాల ఆధారంగా పరిశీలించుకోవాలి. లేకపోతే కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసి తెలుసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని