ఆలయానికి వెళుతూ... కానరాని లోకాలకు
రహదారిపై గుడికి వెళుతున్న గురుస్వామిని ఓ టూరిస్టు బస్సు తాకడంతో గాయపడి మృతి చెందిన సంఘటన పెద్దదోర్నాలలో బుధవారం చోటుచేసుకుంది.
వెంకట సుబ్బారావు ( పాతచిత్రం)
పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: రహదారిపై గుడికి వెళుతున్న గురుస్వామిని ఓ టూరిస్టు బస్సు తాకడంతో గాయపడి మృతి చెందిన సంఘటన పెద్దదోర్నాలలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలియజేసిన వివరాల మేరకు..అయ్యప్పస్వామి దేవాలయంలో గురుస్వామిగా పూజలు అందిస్తున్న దేసు వెంకటసుబ్బారావు (56) బుధవారం వేకువజామున ఇంటి నుంచి ఆలయానికి కాలినడకన బయలుదేరారు. ఆ సమయంలో విజయనగరానికి చెందిన అయ్యప్పమాలధారులను శ్రీశైలానికి తీసుకుని వెళుతున్న యాత్రికుల బస్సు ఆయన వెనుక భాగానికి తగిలింది. తలకు గాయమై ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు.
పెళ్లి రోజునే మృత్యువాత : పెద్దదోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ముందు శీతల పానీయాల దుకాణం నిర్వహిస్తున్న వెంకటసుబ్బారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు. సుబ్బారావు 23 ఏళ్లుగా అయ్యప్ప మాల ధరిస్తున్నారు. అయ్యప్ప దేవాలయంలో ప్రధాన గురుస్వామిగా ఉంటూ పూజలు నిర్వహిస్తున్నారు. బుధవారం తన పెళ్లి రోజని, దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మాలధారులకు భిక్ష అందిస్తానని మంగళవారం చెప్పారు. బుధవారం ఉదయం దేవాలయానికి చేరుకోక ముందే ఆయన మృత్యువాత పడ్డారు. ఇంటి నుంచి వెళ్లిన కుటుంబ పెద్ద విగత జీవిగా మారడటంతో ఆ కుటుంబసభ్యుల ఆవేదన అంతాఇంతా కాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూన్ 4 ఇంకా రాదేమి!
[ 21-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసి వారమైంది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూమ్‌లలో పదిలంగా ఉంది. జూన్ 4న ఓట్ల లెక్కింపుతో విజేతలెవరనేది తేలిపోతుంది. -
ప్రమాదంలో తపాలా తీర్పు!
[ 21-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఓట్లు నిక్షిప్తం చేసుకున్న ఈవీఎంలు స్ట్రాంగ్‌రూముల్లో కేంద్ర సాయుధ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసు పహారాలో ఉన్నాయి. వీటి భద్రతపై అనుమానాలు లేవు. -
ఊరికో వైకాపా మారీచుడు
[ 21-05-2024]
వైకాపా నేతలు ఇసుక, మట్టిలో తెగ మేశారు. సహజ వనరులను కొల్లగొట్టి నమిలి మింగారు. దొంగలు దొంగలూ కలిసి ఊళ్లు పంచుకున్నట్లు- జిల్లాలో అధికారికంగా ఒక్క రీచ్ కూడా లేకున్నా.. ఇసుక లభించే ప్రాంతాలను పంచేసుకున్నారు. -
జిల్లా జల్లెడ
[ 21-05-2024]
జిల్లాలోని పలు ప్రాంతాలను పోలీసులు జల్లెడ పట్టారు. సోమవారం తెల్లవారుజాము నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. -
స్ట్రాంగ్ రూమ్‌లకు మూడంచెల భద్రత
[ 21-05-2024]
ఈవీఎంలు భద్రపరిచిన నేపథ్యంలో ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణానికి సాయుధ బలగాలతో మూడంచెల భద్రతను కల్పించినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
హర్షిత.. స్వర్ణ విజేత
[ 21-05-2024]
జాతీయ స్థాయిలో నిర్వహించిన నైపుణ్య పోటీల్లో జిల్లాకు చెందిన విద్యార్థిని నూకసాని హర్షిత సత్తా చాటి బంగారు పతకం కైవనం చేసుకుంది. -
రూ. కోట్ల వ్యయం.. నిర్లక్ష్యమే ఘనం
[ 21-05-2024]
రూ. కోట్ల వ్యయంతో చేపట్టే పనుల్లో చిత్తశుద్ధి కొరవడటంతో అవి ఎవరికీ ఉపకరించడం లేదు. ముందుచూపు లేకుండా మొక్కుబడిగా చేయడంతో ఎవరికీ అక్కరకు రావడం లేదు. మార్కాపురంలోని సప్లయ్ ఛానల్ పనులే దీనికి సజీవ సాక్ష్యం. -
ఉత్సాహంగా ఎడ్ల బల ప్రదర్శన
[ 21-05-2024]
మండలంలోని రామాపురంలో పట్టాభి రామస్వామి తిరునాళ్ల మహోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలను అంబాల చినవెంకటరెడ్డి, నిర్వాహకులు ప్రారంభించారు. -
గుండ్లకమ్మ నదా! డంపింగ్ యార్డా..!!
[ 21-05-2024]
మార్కాపురం పట్టణానికి సమీపంలో ఉన్న గుండ్లకమ్మ నది పెద్ద డంపింగ్ యార్డుగా మారింది. పట్టణంలోని నివాసాల నుంచి సేకరించిన చెత్తను నదిలో పడేస్తుండటంతో నది కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్‌స్పోర్ట్స్