icon icon icon
icon icon icon

Madhya Pradesh: రాహుల్‌ గాంధీ ప్రచారం వేళ.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు షాక్‌

ఎన్నికల వేళ మరో కీలక నేత కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో ఈ పరిణామం చోటుచేసుకుంది.

Published : 30 Apr 2024 18:02 IST

ఇందౌర్‌: సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ (Congress)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)కు చెందిన కీలక నేత రామ్‌నివాస్ రావత్ (Ramniwas Rawat) భాజపాలో చేరారు. హస్తం పార్టీలో మంత్రిగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. భారీగా తరలివచ్చిన తన మద్దతుదారులతో కలిసి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భిండ్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండటం గమనార్హం.

విజయపుర్ సిటింగ్ ఎమ్మెల్యే అయిన రావత్.. గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో కీలక నేత. లోక్‌సభ ఎన్నికలు ప్రకటించిన దగ్గరినుంచి ఈయనకంటే ముందు మధ్యప్రదేశ్‌ నుంచి పలువురు కాంగ్రెస్‌లో చేరారు. మార్చి చివర్లో మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ అత్యంత సన్నిహితుడు, ఎమ్మెల్యే కమలేశ్ షా, పది రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే హరి వల్లభ్‌ శుక్లా, ఇక నిన్న అక్షయ్ కాంతి బమ్ భాజపాలో చేరారు. అక్షయ్ చివరి నిమిషంలో ఇందౌర్‌ లోక్‌సభ స్థానానికి వేసిన నామినేషన్‌ను వెనక్కి తీసుకొని మరీ హస్తాన్ని వీడారు. ఇందౌర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి నాలుగోవిడతలో భాగంగా మే 13న పోలింగ్‌ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారమే చివరి రోజు. ఈ క్రమంలోనే నిన్న ఉదయం అక్షయ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్‌ పత్రాలను వెనక్కి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img