icon icon icon
icon icon icon

loksabha polls: ఈసీ మా పార్టీ ప్రచార గీతాన్ని బ్యాన్‌ చేసింది: దిల్లీ మంత్రి ఆతిశీ

తమ పార్టీ  ప్రచార గీతాన్ని ఎన్నికల సంఘం నిషేధించిందని ఆప్‌ నేత, దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు.  

Published : 28 Apr 2024 18:27 IST

దిల్లీ: తమ పార్టీ ప్రచార గీతాన్ని ఎన్నికల సంఘం నిషేధించిందని ఆప్‌ నేత, దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు. భాజపా, ఈసీ తీరుపై ఆమె మండిపడ్డారు.  దర్యాప్తు సంస్థలను, భాజపా ప్రభుత్వాన్ని పాటలో చెడుగా చూపించారని ఈసీ పేర్కొందని ఆమె తెలిపారు. అయితే.. తాము అలా చూపించలేదని చెప్పారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం స్పందించలేదు.

‘‘ఒక పార్టీ ప్రచార గీతంపై ఈసీ నిషేధం విధించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. పాటలో భాజపాను ప్రస్తావించలేదు. ఎన్నికల నియమావళిని  ఉల్లంఘించలేదు. వాస్తవాలనే గీతంగా రాయించాం’’ అని ఆతిశీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. భాజపా ఉల్లంఘనలపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. రెండు నిమిషాల నిడివితో ఉన్న ఆప్‌ ప్రచార గీతాన్ని ఎమ్మెల్యే దిలీప్ పాండే రాసి, పాడారు. ఈ గీతాన్ని గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. తమ నేతలను జైలులో వేసినందుకు జవాబుగా ఆమ్‌ ఆద్మీపార్టీకి ఓటు వేస్తాం అని అర్థం వచ్చేలా ఈ పాటను రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img