icon icon icon
icon icon icon

Neha Sharma: తండ్రి కోసం ‘చిరుత’ బ్యూటీ ప్రచారం

సినీనటి నేహాశర్మ తన తండ్రి తరఫున ఎన్నికల ప్రచారంలో సందడి చేసి ఆకట్టుకున్నారు.

Published : 23 Apr 2024 00:06 IST

భగల్‌పుర్‌: సినీనటి నేహాశర్మ(Neha Sharma) ఎన్నికల ప్రచారంలో మెరిశారు. తన తండ్రి అజిత్‌ శర్మ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఆయన తరఫున ఎన్నికల రోడ్‌షోలో పాల్గొని ప్రచారం చేశారు. నేహా తండ్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా.. కాంగ్రెస్‌ ఆయన్ను బిహార్‌లోని భగల్‌పుర్‌ లోక్‌సభ సీటు నుంచి బరిలో దించింది.  ఈ సందర్భంగా ప్రచార రథంపైకి ఎక్కిన నేహా.. ఓటర్లకు అభివాదం చేస్తూ సందడి చేసిన ఫొటోలను ఆమె తండ్రి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. తన కుమార్తెకు ఇంత ప్రేమ, గౌరవం ఇచ్చినందుకు పీర్‌పైంటి, కహల్‌గావ్‌ ప్రాంతాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోడ్‌షోలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు చెప్పారు.

‘చిరుత’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బాలీవుడ్ నటి నేహా శర్మ రాజకీయ ప్రవేశంపై జాతీయ మీడియాలో ఇటీవల చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఆమెకు భగల్‌పుర్‌ సీటు ఇప్పించేందుకు తండ్రి సైతం ప్రయత్నించినప్పటికీ.. కాంగ్రెస్‌ పార్టీ ఆయనకే ఈ టికెట్‌ కేటాయించింది. దీంతో జేడీయూ అభ్యర్థి అజయ్‌ మండల్‌పై అజిత్‌ శర్మ పోటీ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల రెండో దశలో భాగంగా భగల్‌పుర్‌లో ఏప్రిల్‌ 26న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. 24వ తేదీతో ప్రచార పర్వానికి తెరపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img