icon icon icon
icon icon icon

Akhilesh Yadav: భార్యకు రూ.54 లక్షలు అప్పు ఇచ్చిన అఖిలేశ్.. ఆస్తులు ఎన్నంటే?

ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav), ఆయన సతీమణి డింపుల్‌ తమ ఆస్తుల వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. 

Published : 26 Apr 2024 19:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) తన పేరిట ఉన్న ఆస్తుల్ని ప్రకటించారు. ప్రస్తుతం కన్నౌజ్‌ నియోజవర్గం నుంచి పోటీ చేస్తోన్న ఆయనకు రూ.26.34 కోట్ల ఆస్తిపాస్తులున్నాయి. ఆయన సతీమణి, మైన్‌పురీ అభ్యర్థి డింపుల్ యాదవ్ (Dimple Yadav) ఆస్తుల మొత్తం రూ.15 కోట్లుగా ఉంది. మొత్తంగా వారిద్దరి సంపద విలువ రూ.41 కోట్లని నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. 

అఖిలేశ్‌.. చరాస్తులు రూ.9.12 కోట్లు కాగా, స్థిరాస్తులు రూ.17.22 కోట్లుగా ఉన్నాయి. రూ.25.61 లక్షలు నగదు రూపంలో ఉందని, రూ.5.41 కోట్లు బ్యాంక్‌లో ఉందని పేర్కొన్నారు. ఇక ఆయన ఐదు సంవత్సరాల వార్షిక సగటు ఆదాయం రూ.87 లక్షలు కాగా.. డింపుల్‌ ఆదాయం రూ.65 లక్షలుగా ఉంది. ఈ వివరాల్లో ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మాజీ సీఎం తన భార్యకు రూ.54 లక్షలు అప్పుగా ఇచ్చారట. 

ఇదిలాఉంటే.. మొదట కన్నౌజ్ నుంచి ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ అన్నయ్య మనవడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ను అఖిలేశ్‌ బరిలోకి దింపారు. అయితే రెండురోజుల క్రితం ఈ సీటుపై అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తానే అక్కడినుంచి పోటీ చేస్తానని ప్రకటించి, నామినేషన్‌ సమర్పించారు. మైన్‌పురీ, కన్నౌజ్‌లో మూడు, నాలుగు విడతల్లో పోలింగ్ జరగనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img