icon icon icon
icon icon icon

Loksabha polls: రిజర్వేషన్లను భాజపా ఎప్పటికీ తొలగించదు: అమిత్‌ షా

లోక్‌సభ ఎన్నికల వేళ అధికార భజపా, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Published : 28 Apr 2024 22:46 IST

దిల్లీ: భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రాహుల్‌ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

యూపీలోని కాస్‌గంజ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ‘‘రిజర్వేషన్ల పేరుతో రాహుల్‌ గాంధీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. రిజర్వేషన్లను తొలగించాలనే ఆలోచన భాజపాకు ఉంటే ఇప్పటికే ఆ విధంగా చర్యలు తీసుకునే వాళ్లం. వాటిని తొలగించడానికి సంపూర్ణ మెజారిటీ ఉంది. కానీ మోదీ రిజర్వేషన్లకు మద్దతునిస్తారు. ఈ రోజు నేను మీకు మాటిస్తున్నాను. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను భాజపా ఎప్పటికీ తొలగించదు’’ అని స్పష్టం చేశారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయించిన రిజర్వేషన్‌ కోటాలో కొంత భాగాన్ని మైనారిటీ వర్గాలకు, ముఖ్యంగా ముస్లింలకు కాంగ్రెస్ కేటాయిస్తోందని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ప్రకటించిందని షా తెలిపారు. ఆ నాలుగు శాతాన్ని ఎవరి కోటా నుంచి కేటాయించారో ప్రజలకు తెలియదా? అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img