icon icon icon
icon icon icon

Bhatti Vikramarka: తెలంగాణను అధోగతి పాలు చేసిన కేసీఆర్‌: ఉప ముఖ్యమంత్రి భట్టి

ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చేసిన విమర్శలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. 

Published : 09 May 2024 23:28 IST

మధిర: ఖమ్మం ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డిని భారీ మెజార్జీతో గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. గురువారం ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన పార్టీ కార్నర్‌ మీటింగ్‌లో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మధిర అసెంబ్లీ నియోజకవర్గం నాకు అత్యంత ప్రాణపదమైంది. మీరంతా ఓటేసి గెలిపిస్తేనే నేను ఉప ముఖ్యమంత్రి హోదాలో మీ అందరిముందు మాట్లాడుతున్నా. మీరు చూపించిన ప్రేమ, ఆశీస్సులతో వచ్చిన ఈ పదవితో తెలంగాణ, మధిర ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తా.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణలో వచ్చే ప్రతి రూపాయి.. తిరిగి ప్రజలకే పంచేందుకు ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. నేను అడుగుతున్నా.. అయ్యా.. మీరు ఇచ్చిన హామీ ప్రకారం మూడెకరాలు ఇచ్చారా? డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇచ్చారా? పదేళ్లలో సంపదను దోచేసి.. తెలంగాణను అధోగతి పాలు చేశారు. రాష్ట్ర ప్రజలపై రూ.7లక్షల కోట్లు అప్పుల భారం వేశారు’’ అని భట్టి విమర్శలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img