icon icon icon
icon icon icon

Loksabha polls: అర్విందర్ లవ్లీ రాజీనామా.. భాజపా స్పందనిదే..

లోక్‌సభ ఎన్నికల వేళ  దిల్లీ కాంగ్రెస్ చీఫ్ అర్విందర్‌ సింగ్‌ లవ్లీ రాజీనామా చేయడంపై భాజపా స్పందించింది.

Updated : 28 Apr 2024 15:45 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ దిల్లీ కాంగ్రెస్ చీఫ్ అర్విందర్‌ సింగ్‌ లవ్లీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీనిపై భాజపా స్పందించింది. దిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని ఆప్‌ పూర్తిగా తుడిచి పెట్టేసిందని పేర్కొంది. దిల్లీలో ఆప్-కాంగ్రెస్ కూటమిలో వచ్చిన విభేదాలను భాజపా ఎత్తి చూపింది. గతంలో సోనియా గాంధీని, దివంగత దిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను అరెస్టు చేస్తామని ఆప్‌ ఇచ్చిన హామీని భాజపా నేత షెహజాద్ పూనావాలా గుర్తు చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి లక్ష్యం లేదు, అందులో  గందరగోళం, విభజన మాత్రమే ఉన్నాయి. దీనిపై వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యకర్తలు దిల్లీ వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు ’’ అని పేర్కొన్నారు.

రాజీనామా సమర్పించిన అనంతరం అర్విందర్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్‌పై తప్పుడు, అవినీతి ఆరోపణలు చేస్తూ ఏర్పడిన పార్టీతో పొత్తును దిల్లీ కాంగ్రెస్ యూనిట్ వ్యతిరేకించింది. అయినప్పటికీ, ఇక్కడ ఆప్‌తో పొత్తు పెట్టుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. అధిష్ఠానం నిర్ణయం మేరకు కూటమిని సమర్థించాం’’ అని తెలియజేశారు. డీపీసీసీ అధ్యక్ష హోదాలో పార్టీ పదవుల నియామకాలను చేపట్టేందుకు తనను అనుమతించట్లేదని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img