icon icon icon
icon icon icon

Loksabha polls: భారత్‌ను కాంగ్రెస్‌ ఎప్పటికీ బలోపేతం చేయదు: మోదీ

దేశాన్ని కాంగ్రెస్‌ ఎప్పటికీ  బలోపేతం చేయదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Published : 21 Apr 2024 23:39 IST

జైపూర్‌: దేశాన్ని కాంగ్రెస్‌ ఎప్పటికీ బలోపేతం చేయదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో భాజపా అభ్యర్థి లుంబారామ్ చౌదరికి మద్దతుగా మోదీ పాల్గొన్నారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ‘‘మొదటి దశ పోలింగ్‌లో రాజస్థాన్‌లోని సగం మంది ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారు. కాంగ్రెస్‌ ఎప్పటికీ దేశాన్ని శక్తిమంతం చేయదని ఇక్కడి ప్రజలకు తెలుసు. 2014కు ముందున్న పరిస్థితులు మళ్లీ రావాలని దేశం కోరుకోవట్లేదు’’ అని మోదీ తెలిపారు.

బంధుప్రీతి, అవినీతితో చెదలు పట్టిన కాంగ్రెస్‌ దేశాన్ని అభివృద్ధి చెందకుండా చేసిందని దుయ్యబట్టారు. నేడు అది చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తోందన్నారు. ఒకప్పుడు 400 సీట్లు గెలిచిన పార్టీ ప్రస్తుతం 300 సీట్లలో కూడా సొంతంగా పోటీ చేయలేకపోయిందని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి ఇంటికి, ప్రతి రైతుకు నీరు అందేలా చేయటం తన లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ కింద 11 కోట్లకు పైగా కుటుంబాలు లబ్ధి పొందాయని తెలిపారు. దురదృష్టం కొద్దీ రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో కూడా అవినీతి చేసిందని, ఈ తప్పును మరోసారి జరగనీయకుండా కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని ప్రధాని ప్రజలను కోరారు.

రాజస్థాన్‌లో 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 12 స్థానాలకు మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న నిర్వహించగా, మిగిలిన 13 స్థానాలకు ఏప్రిల్ 26న రెండో విడత పోలింగ్ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img