icon icon icon
icon icon icon

Viral video: చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో ఏక్‌నాథ్‌ శిందే సందడి

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే శనివారం కొల్హాపూర్‌, అనంతపురం సొసైటీలో ఐదేళ్ల బాలుడి పుట్టినరోజు వేడుకలో పాల్గొని సందడి చేశారు.

Published : 28 Apr 2024 13:20 IST

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే శనివారం కొల్హాపూర్‌, అనంతపురం సొసైటీలో ఐదేళ్ల బాలుడి పుట్టినరోజు వేడుకలో పాల్గొని సందడి చేశారు. శనివారం కొల్హాపూర్‌లో పార్టీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని  మోదీ, శిందే పాల్గొన్నారు. అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో ముఖ్యమంత్రి ఆ ప్రాంతంలో బస చేశారు. కాగా ఓ ఐదేళ్ల చిన్నారి రిధాన్ తన పుట్టినరోజుకు రావాలని సీఎంను కోరాడు. శిందే వెంటనే అతడి ఆహ్వానాన్ని అంగీకరించారు. అనంతరం రిధాన్‌ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని కేక్‌ కట్‌ చేయించారు. చిన్నారితో సరదాగా గడుపుతూ సందడి చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు ముఖ్యమంత్రిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మహారాష్ట్రలోని కొల్హాపూర్, రాయ్‌గఢ్, బారామతి, ఉస్మానాబాద్, లాతూర్, షోలాపూర్, మాధా, సాంగ్లీ, సతారా, రత్నగిరి-సింధుదుర్గ్ నియోజకవర్గాలకు మే 7న లోక్‌సభ మూడో దశలో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని మిగిలిన స్థానాలకు మే 13, 20, 25, జూన్ 1 తేదీల్లో పోలింగ్ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img