icon icon icon
icon icon icon

కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం

కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగు సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించి ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు.

Updated : 20 Apr 2024 12:49 IST

ఈటీవీ భారత్‌: కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగు సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించి ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు. ముగ్గురు మహిళలు సహా 9 మంది సిబ్బంది వీలైనంత దూరం జీపులో వెళ్లారు. కాలినడకన సెలయేరు, కొండ దారులు దాటుతూ ఆ గ్రామంలో నివసించే శివలింగం (92) అనే ఓటరును కలుసుకున్నారు. వయసు మీదపడి మంచానికి పరిమితమైన శివలింగానికి ఓటు వేయాలనే సంకల్పం బలంగా ఉండటంతో ఇంటి నుంచి ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.  పోలింగు సామగ్రితో బుధవారం ఉదయం ఆరింటికి బయలుదేరిన సిబ్బంది మధ్యాహ్నానికి గ్రామానికి చేరుకున్నారు. శివలింగం ఇంట్లో మంచం పక్కనే పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేశారు. తన మనవడి సాయంతో ఓటు వేసిన శివలింగం పోలింగ్‌ సిబ్బందికి కన్నీటితో వీడ్కోలు పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img