icon icon icon
icon icon icon

తొలిదశ పోలింగ్‌ 65.5%

లోక్‌సభ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్‌ 65.5 శాతానికి చేరింది. శుక్రవారం 102 నియోజకవర్గాల్లో నిర్వహించిన పోలింగ్‌లో సుమారు 62.37% మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రాథమిక అంచనాలు వెల్లడించిన విషయం తెలిసిందే.

Published : 21 Apr 2024 04:49 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్‌ 65.5 శాతానికి చేరింది. శుక్రవారం 102 నియోజకవర్గాల్లో నిర్వహించిన పోలింగ్‌లో సుమారు 62.37% మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రాథమిక అంచనాలు వెల్లడించిన విషయం తెలిసిందే. శనివారం మరిన్ని వివరాలు రావడంతో ఇది మూడు శాతానికిపైగా పెరిగినట్లయింది. అస్సాంలో ఐదు లోక్‌సభ స్థానాల్లో 72.10 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నట్లు తొలుత చెప్పినా అది 78.25 శాతానికి చేరింది. ఆదివారానికి తుది గణాంకాలను ఈసీ లాంఛనంగా ప్రకటించే అవకాశముంది. పోలింగ్‌ శాతం ఎక్కువేనని, ఇది చాలావరకు ప్రశాంతంగానే జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img