icon icon icon
icon icon icon

భాజపాలో చేరిన కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి తేజిందర్‌

లోక్‌సభ ఎన్నికల వేళ పంజాబ్‌లో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రియాంకా గాంధీకి సన్నిహితుడు, కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి తేజిందర్‌ పాల్‌ సింగ్‌ బిట్టు పార్టీ పదవులతోపాటు కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Published : 21 Apr 2024 04:49 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ పంజాబ్‌లో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రియాంకా గాంధీకి సన్నిహితుడు, కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి తేజిందర్‌ పాల్‌ సింగ్‌ బిట్టు పార్టీ పదవులతోపాటు కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డేల సమక్షంలో భాజపాలో చేరారు. దివంగత కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సంతోఖ్‌ సింగ్‌ చౌదరి భార్య కరమ్‌జీత్‌ కౌర్‌ చౌదరి కూడా భాజపాలో చేరారు. కరమ్‌జీత్‌ చౌదరి గత ఏడాది సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న తన భర్త మరణంతో జలంధ]ర్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తేజిందర్‌ సింగ్‌ను పార్టీలోకి ఆహ్వానించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 60 ఏళ్లలో చేసిన అభివృద్ధి కంటే ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో చేసిన అభివృద్ధే ఎక్కువని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img