icon icon icon
icon icon icon

రిజర్వేషన్ల రద్దు యోచన లేదు

రిజర్వేషన్లను రద్దుచేయాలనే యోచన భాజపాకు లేదని, ఆ విషయంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్పారు.

Published : 21 Apr 2024 04:50 IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

కోటా,మథుర: రిజర్వేషన్లను రద్దుచేయాలనే యోచన భాజపాకు లేదని, ఆ విషయంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను రద్దు చేయాలని ఒకవేళ విపక్షం కోరుకున్నా భాజపా అలా జరగనివ్వదని, ఇది మోదీ గ్యారంటీ అని పునరుద్ఘాటించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా తరఫున రాజస్థాన్‌లోని కోటా లోక్‌సభ స్థానంలో శనివారం ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.  పదేళ్లలో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్న మోదీకి ఓటు వేయడమంటే గొప్ప భారత్‌ సృష్టికి మద్దతు ఇవ్వడమేనన్నారు. . మథుర నుంచి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి హేమామాలినికి మద్దతుగా బృందావన్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img