icon icon icon
icon icon icon

ఎన్నికల కోసం ఆస్తులు అమ్మి.. 14వ సారి బరిలోకి పోపట్‌లాల్‌

రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా సమ్‌దారి ప్రాంతానికి చెందిన పోపట్‌లాల్‌ (57) ఇప్పటికి 13 సార్లు వివిధ ఎన్నికల్లో పోటీ చేసి ఓడినా.. తాజా లోక్‌సభ ఎన్నికల్లో 14వ సారి మళ్లీ బరిలో నిలిచారు.

Published : 21 Apr 2024 04:52 IST

ఈటీవీ భారత్‌: రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా సమ్‌దారి ప్రాంతానికి చెందిన పోపట్‌లాల్‌ (57) ఇప్పటికి 13 సార్లు వివిధ ఎన్నికల్లో పోటీ చేసి ఓడినా.. తాజా లోక్‌సభ ఎన్నికల్లో 14వ సారి మళ్లీ బరిలో నిలిచారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా.. పశువులు, భూమిని అమ్మి మరీ పదే పదే ఎన్నికల బరిలోకి దిగుతుండటం విశేషం. ఈయన భార్య, కుమారుడు కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. తన ప్రాంత ప్రజలకు సేవ చేయడమే సంకల్పమని చెబుతున్న పోపట్‌లాల్‌ ఇప్పటివరకు నాలుగుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, మూడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో  అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తన భార్యను సైతం అయిదుసార్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, ఓసారి జడ్పీ ఎన్నికల్లో నిలబెట్టారు. స్వతంత్ర అభ్యర్థిగా పోపట్‌లాల్‌ పోటీచేస్తున్న బాడ్‌మేర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి కైలాశ్‌ చౌధరీ, రవీంద్రసింగ్‌ భాటి, ఉమ్మేదారామ్‌ బేనీవాల్‌ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img