icon icon icon
icon icon icon

చక్రాల కుర్చీలో వచ్చి మరీ.. ఓటు

ఎన్నికల సమయంలో ఇంటి పక్కన ఉండే పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటేయడానికి కూడా కొందరు బద్ధకిస్తారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన 111 ఏళ్ల పూల్‌మతి సర్కార్‌ మాత్రం అలా అనుకోలేదు.

Published : 21 Apr 2024 04:53 IST

సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న 111 ఏళ్ల బామ్మ వీడియో

గడ్చిరోలి: ఎన్నికల సమయంలో ఇంటి పక్కన ఉండే పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటేయడానికి కూడా కొందరు బద్ధకిస్తారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన 111 ఏళ్ల పూల్‌మతి సర్కార్‌ మాత్రం అలా అనుకోలేదు. తన ఓటు.. తన హక్కు అని భావించింది. అందుకోసం ఆ బామ్మ మండుటెండను లెక్క చేయలేదు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమన్నా ఖాతరు చేయలేదు. ఇంటి దగ్గర నుంచే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశం ఉందన్నా ఆసక్తి చూపలేదు. నడవడానికి సత్తువ లేకున్నా తన హక్కును పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. మారుమూల ప్రాంతంలో ఉన్న గోవింద్‌పుర్‌ పోలింగ్‌ కేంద్రానికి బంధువు సాయంతో చక్రాల కుర్చీలో వెళ్లి మరీ ఓటు వేశారు. లోక్‌సభ ఎన్నికల తొలి దశ ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఈ  ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img