icon icon icon
icon icon icon

దిల్లీ మేయర్‌ ఎన్నికల్లో ఆప్‌నకు కాంగ్రెస్‌ మద్దతు

దిల్లీ మేయర్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అభ్యర్థులకు తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్‌ ప్రకటించింది.

Published : 21 Apr 2024 05:12 IST

దిల్లీ: దిల్లీ మేయర్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అభ్యర్థులకు తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ నెల 26న జరగనున్న ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులుగా మేయర్‌ పదవి కోసం మహేశ్‌ ఖిచీ, డిప్యూటీ మేయర్‌ పదవికి రవీందర్‌  భరధ్వాజ్‌లను ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఈ అంశంపై శనివారం సమావేశం నిర్వహించిన కాంగ్రెస్‌ మేయర్‌ ఎన్నికల్లో తమ కౌన్సిలర్ల మద్దతును ప్రకటించే విషయమై నిర్ణయం తీసుకుంది. మరోవైపు, దిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img