icon icon icon
icon icon icon

ఫలితాలు రాకుండా ఎలా చెబుతారు?

భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జాత్యాహంకార, నియంతృత్వ, అణచివేత సర్కార్‌గా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శనివారం విమర్శించారు.

Published : 21 Apr 2024 05:12 IST

మోదీ వ్యాఖ్యలపై ప్రియాంక ఆగ్రహం

త్రిశ్శూర్‌, పథనంథిట్ట: భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జాత్యాహంకార, నియంతృత్వ, అణచివేత సర్కార్‌గా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శనివారం విమర్శించారు. స్వాతంత్య్రయోధుల రక్తంతో రచించిన భారత రాజ్యాంగాన్ని మారుస్తామంటూ అహంకారపూరితంగా పేర్కొంటోందని ఆక్షేపించారు. సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీని, ఇండియా కూటమిని తిరస్కరించారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక మండిపడ్డారు. ఫలితాలు రాకుండా ఫలానా పార్టీని ఓటర్లు తిరస్కరించారంటూ ఎలా చెప్తారని ప్రశ్నించారు. కేరళలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె ప్రసంగిస్తూ తాను ఎక్కడికెళ్లినా అక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది కచ్చితంగా జరిగి తీరుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img