icon icon icon
icon icon icon

మేకిన్‌ ఇండియా అంటారు.. చైనా వస్తువుల్ని ప్రోత్సహిస్తారు

భారత్‌లో తయారీ (మేకిన్‌ ఇండియా) గురించి వివిధ వేదికలపై మాట్లాడే ప్రధాని నరేంద్రమోదీ మన దేశంలోని చిన్న పరిశ్రమల్ని మాత్రం- పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ విధింపు వంటి చర్యల ద్వారా భ్రష్టు పట్టించారని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు.

Published : 21 Apr 2024 05:13 IST

ప్రధాని మోదీపై రాహుల్‌ విమర్శ

అమ్రోహా (యూపీ): భారత్‌లో తయారీ (మేకిన్‌ ఇండియా) గురించి వివిధ వేదికలపై మాట్లాడే ప్రధాని నరేంద్రమోదీ మన దేశంలోని చిన్న పరిశ్రమల్ని మాత్రం- పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ విధింపు వంటి చర్యల ద్వారా భ్రష్టు పట్టించారని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. చైనా వస్తువులు మనదేశంలో అమ్ముడవడం ద్వారా కోటీశ్వరులు లబ్ధి పొందాలనేదే ప్రధాని అసలు ఉద్దేశమని చెప్పారు. యూపీలోని అమ్రోహాలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి శనివారం ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అగ్నివీర్‌ పథకాన్ని రద్దు చేస్తుందని చెప్పారు. కేవలం 15-20 మంది శతకోటీశ్వరుల కోసమే గత పదేళ్లలో మోదీ పనిచేశారని, దేశ సంపద మొత్తాన్ని వారికే కట్టబెట్టారని ఆరోపించారు. 70 కోట్ల మంది భారతీయుల మొత్తం సంపద ఎంతో 22 మంది వద్ద అంత ఉందని చెప్పారు. వీరంతా చైనా వస్తువుల్ని మనకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. విపక్ష ఇండియా కూటమి నెగ్గితే ఈ డబ్బును పేదలకు ఇస్తామని చెప్పారు. పేద కుటుంబాల్లోని మహిళకు ఏడాదికి రూ.లక్ష ఇచ్చే పథకాన్ని ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశం ప్రవేశపెట్టలేదని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని నాశనం చేయాలని భాజపా, ఆరెస్సెస్‌ చూస్తున్నా, ప్రపంచంలో ఏ శక్తీ అలా చేయజాలదని రాహుల్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img