icon icon icon
icon icon icon

నాడు ఓటమిని అంగీకరించని ప్రత్యర్థి

దేశంలో తొలిసారి రీకౌంటింగ్‌ ప్రక్రియ సుప్రీం కోర్టులో జరిగిన ఘటన 1967లో నమోదైంది. హరియాణాలోని కీలక లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో తన ఓటమిని జీర్ణించుకోలేని ఒక అభ్యర్థి, ఓట్ల లెక్కింపులో అన్యాయం జరిగిందంటూ ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Published : 21 Apr 2024 05:13 IST

సుప్రీంకోర్టులో రీకౌంటింగ్‌
1967 ఎన్నికల్లో ఘటన

దిల్లీ: దేశంలో తొలిసారి రీకౌంటింగ్‌ ప్రక్రియ సుప్రీం కోర్టులో జరిగిన ఘటన 1967లో నమోదైంది. హరియాణాలోని కీలక లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో తన ఓటమిని జీర్ణించుకోలేని ఒక అభ్యర్థి, ఓట్ల లెక్కింపులో అన్యాయం జరిగిందంటూ ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా మొదటిసారి ఓట్ల లెక్కింపు సర్వోన్నత న్యాయస్థానంలో జరిగింది. 1967లో నాలుగో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కర్నాల్‌ నియోజకవర్గం నుంచి జన్‌సంఘ్‌ తరఫున స్వామి రామేశ్వర్‌ నంద్‌ బరిలో నిలిచారు. ఆయనకు పోటీగా స్వాతంత్య్ర సమర యోధుడు, సామాజిక కార్యకర్త మాధవ్‌ రామ్‌ శర్మను కాంగ్రెస్‌ పోటీలో నిలిపింది. ఈ ఎన్నికల్లో మాధవ్‌ రామ్‌ శర్మ కేవలం 55 ఓట్లతో గెలుపొందారు. తన ఓటమిని జీర్ణించుకోలేని నంద్‌ మరోసారి ఓట్ల లెక్కింపు జరపాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. దీంతో మళ్లీ కౌంటింగ్‌ నిర్వహించగా నంద్‌ కంటే శర్మకు 555 ఓట్లు అధికంగా వచ్చాయి. అప్పటికీ సంతృప్తి చెందని నంద్‌ సుప్రీం కోర్టు తలుపు తట్టారు. దీనిపై సుమారు ఏడాదిపాటు విచారణ జరిగింది. ఇందులో భాగంగా అప్పటి న్యాయమూర్తి జస్టిస్‌ మహ్మద్‌ హిదాయతుల్లా నేతృత్వంలోని బెంచ్‌ ఎదుట రీకౌంటింగ్‌ చేపట్టాలని నిర్ణయించారు. దీంతో కౌంటింగ్‌ ప్రక్రియ కొన్నిరోజులపాటు కొనసాగింది. అందులోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి శర్మకే 555 ఓట్ల మెజారిటీ వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img