icon icon icon
icon icon icon

వడోదర బరిలో భాజపా అభ్యర్థిగా విద్యార్థి నేత

సార్వత్రిక ఎన్నికల వేళ గుజరాత్‌ రాజకీయాల్లో హేమాంగ్‌ జోషి (33) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రధాని మోదీ పదేళ్ల క్రితం పోటీచేసిన వడోదర నుంచి బరిలోకి దిగిన జోషి.. అసలు తనకు టికెటు వస్తుందని అనుకోలేదన్నారు.

Published : 21 Apr 2024 05:13 IST

వడోదర: సార్వత్రిక ఎన్నికల వేళ గుజరాత్‌ రాజకీయాల్లో హేమాంగ్‌ జోషి (33) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రధాని మోదీ పదేళ్ల క్రితం పోటీచేసిన వడోదర నుంచి బరిలోకి దిగిన జోషి.. అసలు తనకు టికెటు వస్తుందని అనుకోలేదన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని వడోదర, యూపీలోని వారణాసి నుంచి మోదీ పోటీ చేశారు. రెండుచోట్లా విజయం సాధించడంతో వడోదర స్థానాన్ని రంజన్‌ భట్‌కు కేటాయించారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికతోపాటు 2019లోనూ ఈ స్థానం నుంచి విజయం సాధించిన భట్‌కు ఈసారి కూడా భాజపా టికెట్‌ ఇచ్చింది. అయితే, పార్టీలో అంతర్గత అసమ్మతి కారణంగా ఆయన వైదొలగాల్సి వచ్చింది. ఆ మరుసటి రోజే విద్యార్థి నాయకుడైన జోషి పేరు ప్రకటించారు. ‘‘నాలాంటి వ్యక్తికి ఇంత పెద్ద అవకాశం ఇవ్వడం ఉక్కిరిబిక్కిరి చేసింది. పైగా ఇతర స్థానాల్లో అభ్యర్థులకు మెజారిటీ లక్ష్యం 5 లక్షల ఓట్లు కాగా.. నాకు 10 లక్షల ఓట్ల లక్ష్యం విధించారు’’ అని జోషి తెలిపారు. మీడియా వేదిక ‘ఫాక్స్‌ స్టోరీ ఇండియా’ రూపొందించిన 40 ఏళ్లలోపు యంగ్‌ లీడర్ల జాబితాలో జోషికి చోటు దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img