icon icon icon
icon icon icon

ముస్లిం మహిళలకు పార్లమెంటులో రిజర్వేషన్లు

పార్లమెంటులో మైనారిటీ వర్గాలకు చెందిన మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంటోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 22 Apr 2024 04:04 IST

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌

కిషన్‌గంజ్‌: పార్లమెంటులో మైనారిటీ వర్గాలకు చెందిన మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంటోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. చట్టసభల్లో ముస్లిం మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన ఆవశ్యకతను ఇది సూచిస్తోందన్నారు. బిహార్‌లోని కిషన్‌గంజ్‌లో ఆదివారం నిర్వహించిన సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యానికి ఎంఐఎం వ్యతిరేకమంటూ భాజపా, ఆరెస్సెస్‌ తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని అసదుద్దీన్‌ ఆరోపించారు. సికింద్రాబాద్‌లో 20 ఏళ్ల క్రితమే ఎంఐఎం తరఫున ఓ మహిళను ఎన్నికల బరిలో పోటీకి దించామని గుర్తు చేశారు.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి లోక్‌సభకు 17సార్లు ఎన్నికలు జరిగినప్పటికీ ఎంపీలైన ముస్లిం మహిళలు 20 మందేనని తెలిపారు. ఈ పరిస్థితిని నివారించడానికి ముస్లిం మహిళలకు పార్లమెంటులో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. బీహర్‌లోని కిషన్‌గంజ్‌ లోక్‌సభ స్థానంలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అఖ్తరుల్‌ ఇమాన్‌ తరఫున నిర్వహించిన ప్రచార సభలో అసదుద్దీన్‌ ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img