icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌, జీఎస్‌పీ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కృతి

లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లూ తిరస్కరణకు గురవుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

Published : 22 Apr 2024 04:04 IST

సూరత్‌ : లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లూ తిరస్కరణకు గురవుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గుజరాత్‌లోని సూరత్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలేశ్‌ కుంభాని, అస్సాంలోని కోక్‌రాఝార్‌ స్థానానికి పోటీపడిన గణ సురక్ష పార్టీ (జీఎస్‌పీ) అధ్యక్షుడు నబకుమార్‌ సరనియాల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కుంభాని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ప్రతిపాదకులు చేసిన సంతకాల్లో వ్యత్యాసాలు ఉండటమే ఆయన నామపత్రం తిరస్కరణకు కారణమని జిల్లా రిటర్నింగ్‌ అధికారి ఆదివారం వెల్లడించారు. అలాగే ముందుజాగ్రత్త చర్యగా కాంగ్రెస్‌కు చెందిన సురేశ్‌ పద్‌శాల సూరత్‌ స్థానానికి దాఖలు చేసిన నామినేషనూ తిరస్కరణకు గురైంది. దీంతో ఆ స్థానం నుంచి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పోటీలో లేకుండా పోయింది. మరోపక్క కోక్‌రాఝార్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇప్పటికే రెండు సార్లు ఎంపీగా వ్యవహరించిన నబకుమార్‌ హ్యాట్రిక్‌ ఆశలపై రిటర్నింగ్‌ అధికారి నీళ్లు చల్లారు. ఆయన నామినేషన్‌ పత్రాలు చెల్లనివని, దీంతో వాటిని తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img