icon icon icon
icon icon icon

మహిళా సీఎం ఉన్నా సందేశ్‌ఖాలీ ఘటనలు

రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ పశ్చిమబెంగాల్‌లో సందేశ్‌ఖాలీ లాంటి ఘటనలు జరుగుతున్నాయని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపించారు.

Published : 22 Apr 2024 04:05 IST

సిగ్గుచేటు: రాజ్‌నాథ్‌

జలంగి, మాల్దా: రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ పశ్చిమబెంగాల్‌లో సందేశ్‌ఖాలీ లాంటి ఘటనలు జరుగుతున్నాయని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపించారు. రాష్ట్రంలోని ముర్షిదాబాద్‌, మాల్దా లోక్‌సభ నియోజకవర్గాల భాజపా అభ్యర్థులు గౌరీశంకర్‌ ఘోష్‌, ఖగేన్‌ ముర్ములకు మద్దతుగా ఆదివారం రాజ్‌నాథ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. ‘ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీ వద్ద కొంతమంది తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. గిరిజనుల భూములనూ లాక్కుంటున్నారు. రాష్ట్రంలో రౌడీల పాలన సాగుతోంది. యావత్తు దేశంతో పాటు బెంగాల్‌ల్లోనూ సీఏఏను అమలు పరుస్తాం. దీనిని ఎవ్వరూ ఆపలేరు’ అని పేర్కొన్నారు. బంకించంద్ర ఛటర్జీ, రవీంద్రనాథ్‌ ఠాగుర్‌ లాంటి గొప్ప కవులు పుట్టిన గడ్డ.. నేడు గూండాల నేర కార్యకలాపాలకు అడ్డాగా మారిందని మండిపడ్డారు. భాజపా అధికారంలోకి రాగానే బెంగాల్‌కు పూర్వవైభవం తీసుకువస్తామని రాజ్‌నాథ్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో కుంభకోణం జరిగిందని, ప్రతి నోటిఫికేషన్‌లో స్కామ్‌ జరుగుతున్నట్లు ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img