icon icon icon
icon icon icon

తిరువనంతపురం కాంగ్రెస్‌ అభ్యర్థి శశిథరూర్‌పై కేసు

కేంద్ర మంత్రి, తిరువనంతపురం భాజపా అభ్యర్థి రాజీవ్‌ చంద్రశేఖర్‌పై తప్పుడు ప్రచారం చేశారని ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి శశిథరూర్‌పై కేసు నమోదు చేసినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు.

Published : 22 Apr 2024 04:06 IST

భాజపా అభ్యర్థి రాజీవ్‌ చంద్రశేఖర్‌పై తప్పుడు ప్రచారం చేసినట్లు ఆరోపణ

తిరువనంతపురం: కేంద్ర మంత్రి, తిరువనంతపురం భాజపా అభ్యర్థి రాజీవ్‌ చంద్రశేఖర్‌పై తప్పుడు ప్రచారం చేశారని ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి శశిథరూర్‌పై కేసు నమోదు చేసినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. ఈ నెల 15వ తేదీన సైబర్‌ విభాగం పోలీసులు కేసు నమోదుచేసినా ఆదివారం వివరాలు బహిర్గతమయ్యాయి. టెలివిజన్‌ కార్యక్రమంలో రాజీవ్‌ చంద్రశేఖర్‌కు వ్యతిరేకంగా శశిథరూర్‌ తప్పుడు ప్రచారం చేశారంటూ భాజపా నాయకుడు జె.ఆర్‌.పద్మకుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని తీర ప్రాంతాల ఓటర్లను ఆకర్షించేందుకు రాజీవ్‌ చంద్రశేఖర్‌ పరువుకు నష్టం కలిగించేలా ఎంపీ ప్రకటనలు చేశారని అందులో ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు ఐపీసీ, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద శశిథరూర్‌పై కేసు నమోదు చేశారు. ఈ విషయమై శశిథరూర్‌ స్పందించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img