icon icon icon
icon icon icon

కంగనా రనౌత్‌పై అభ్యంతరకర పోస్టు

హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానం నుంచి భాజపా తరఫున పోటీ చేస్తున్న సినీ నటి కంగనా రనౌత్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకర ప్రచారం చేస్తున్నారంటూ భాజపా ఆదివారం కాంగ్రెస్‌, దాని యూత్‌ క్లబ్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

Published : 22 Apr 2024 04:57 IST

కాంగ్రెస్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన భాజపా

శిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానం నుంచి భాజపా తరఫున పోటీ చేస్తున్న సినీ నటి కంగనా రనౌత్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకర ప్రచారం చేస్తున్నారంటూ భాజపా ఆదివారం కాంగ్రెస్‌, దాని యూత్‌ క్లబ్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కంగన నటించిన చిత్రాల్లోని ఫోటోలతో అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ సామాజిక మాధ్యమాల్లో ఆమెను అవమానించేలా హమీర్‌పుర్‌ కాంగ్రెస్‌ యూత్‌ క్లబ్‌ సభ్యులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని  ఆరోపించింది. తెర వెనక నుంచి కాంగ్రెస్‌ దీనిని ప్రోత్సహిస్తోందని, వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర భాజపా మీడియా బాధ్యుడు కిరణ్‌ నందా ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఇది ఆమె గౌరవాన్ని కించపరచడమే కాకుండా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img