icon icon icon
icon icon icon

మోదీపై దిల్లీ పోలీస్‌ చీఫ్‌కు సీపీఎం ఫిర్యాదు

రాజస్థాన్‌ సభలో ప్రధాని మోదీ ‘సంపద పంపిణీ’ గురించి మాట్లాడుతూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తాము దిల్లీ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు సీపీఎం సోమవారం వెల్లడించింది.

Published : 23 Apr 2024 04:10 IST

దిల్లీ: రాజస్థాన్‌ సభలో ప్రధాని మోదీ ‘సంపద పంపిణీ’ గురించి మాట్లాడుతూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తాము దిల్లీ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు సీపీఎం సోమవారం వెల్లడించింది. నగరంలోని మందిర్‌ మార్గ్‌ పోలీస్‌స్టేషను ఎస్‌హెచ్‌వో కేసు నమోదుకు తిరస్కరించడంతో నేరుగా ఉన్నతాధికారికి ఫిర్యాదు పంపినట్లు సీపీఎం నేతలు బృందా కారట్‌, పుష్పిందర్‌ సింగ్‌ గ్రేవాల్‌ తెలిపారు. ఒక వర్గాన్ని ప్రభావితం చేసేలా ప్రధాని ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మోదీ ప్రసంగ పాఠాన్ని, యూట్యూబ్‌ లింకును ఫిర్యాదుకు జత చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img