icon icon icon
icon icon icon

కనౌజ్‌ అభ్యర్థిగా తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌

ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్‌ నుంచి తమ పార్టీ అభ్యర్థిగా తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ను పోటీలో ఉంచుతున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సోమవారం ప్రకటించింది. బలియా టికెట్‌ సనాతన్‌ పాండేకు ఇస్తున్నట్లు వెల్లడించింది.

Published : 23 Apr 2024 05:11 IST

సమాజ్‌వాదీ పార్టీ వెల్లడి

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్‌ నుంచి తమ పార్టీ అభ్యర్థిగా తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ను పోటీలో ఉంచుతున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సోమవారం ప్రకటించింది. బలియా టికెట్‌ సనాతన్‌ పాండేకు ఇస్తున్నట్లు వెల్లడించింది. కనౌజ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ పోటీ చేస్తారని వచ్చిన ఊహాగానాలకు తాజా ప్రకటనతో తెరపడింది. తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ మనుమడు, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌కు అల్లుడు. 2014 నుంచి 19 వరకు మైన్‌పురి నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img