icon icon icon
icon icon icon

ఓటు వేస్తూ వీడియో..

ఓటు వేస్తున్నప్పుడు సెల్‌ఫోన్‌తో వీడియో తీసుకున్నందుకు ఓ కాంగ్రెస్‌ కార్యకర్తపై సోమవారం కేసు నమోదైంది.

Published : 23 Apr 2024 04:42 IST

మహారాష్ట్రలో కాంగ్రెస్‌ కార్యకర్తపై కేసు నమోదు

నాగ్‌పుర్‌: ఓటు వేస్తున్నప్పుడు సెల్‌ఫోన్‌తో వీడియో తీసుకున్నందుకు ఓ కాంగ్రెస్‌ కార్యకర్తపై సోమవారం కేసు నమోదైంది. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ జిల్లాకు చెందిన సోనమ్‌ రాజేష్‌ శ్రావంకర్‌.. పోలింగ్‌ రోజైన శుక్రవారం మౌదా అనే ప్రాంతంలోని ఓ బూత్‌లో పార్టీ తరఫున ఎన్నికల ప్రతినిధిగా ఉన్నారు. సాయంత్రం తన ఓటు వేయడానికి ఈవీఎం వద్దకు వెళ్లి బటన్‌ నొక్కడాన్ని వీడియో తీసుకున్నారు. అంతే కాకుండా దానిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img