icon icon icon
icon icon icon

త్వరలో జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు

కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ-కశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ సోమవారం తెలిపారు.

Published : 23 Apr 2024 04:43 IST

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌

దిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ-కశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ సోమవారం తెలిపారు. అక్కడి ప్రజలు భాజపా అభివృద్ధి ఎజెండాకు మద్దతుగా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. 2019లో ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూ-కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, దీన్ని ప్రతిపక్షాలు తప్పుగా చిత్రీకరిస్తున్నాయని ఇటీవల ర్యాలీలో ప్రధాని మోదీ చెప్పిన మాటలను జితేంద్ర సింగ్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. గత ప్రభుత్వాలు ఇక్కడ వివక్షను పెంచి పోషించాయని, భాజపా ప్రభుత్వం అభివృద్ధే ఎజెండాగా ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలను అందించిందని తెలిపారు. స్థానిక ప్రజలు మోదీ ఆశయ సాధనలో భాగమవడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఉధంపుర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జితేంద్ర సింగ్‌ గత రెండు పర్యాయాలూ ఇక్కడి నుంచే లోక్‌సభకు ఎన్నికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img