icon icon icon
icon icon icon

పేదరికంపై రాహుల్‌ తప్పుడు లెక్కలు

దేశంలో పేదరికం పెరిగిందని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ తప్పుడు లెక్కలు చెబుతున్నారని భాజపా ఆరోపించింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని (ఈసీ) కోరింది.

Published : 23 Apr 2024 04:44 IST

ఈసీకి భాజపా ఫిర్యాదు

దిల్లీ: దేశంలో పేదరికం పెరిగిందని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ తప్పుడు లెక్కలు చెబుతున్నారని భాజపా ఆరోపించింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని (ఈసీ) కోరింది. దేశంలో ఉత్తర, దక్షిణ విభజనను రాహుల్‌ పదేపదే ప్రస్తావిస్తున్నారని పేర్కొంది. ఆయన చర్యలు కోరుతూ భాజపా ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ నేతృత్వంలోని పార్టీ బృందం ఈసీకి కలిసి వినతిపత్రం సమర్పించింది. ‘ఎటువంటి ఆధారాల్లేకుండా రాహుల్‌ గాంధీ దేశంలో 20 కోట్ల మంది పేదలు   పెరిగారని చెబుతున్నారు. నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారు’ అని ఫిర్యాదు అనంతరం మీడియాకు తరుణ్‌ ఛుగ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img