icon icon icon
icon icon icon

మా మ్యానిఫెస్టోపై భాజపా దుష్ప్రచారం

సమాజంలో అంతరాలను తగ్గించేలా అభివృద్ధిని సాధిస్తామంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భాజపా దుష్ప్రచారం చేస్తోందని ఎన్నికల సంఘానికి(ఈసీ) కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది.

Published : 24 Apr 2024 05:21 IST

ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

దిల్లీ: సమాజంలో అంతరాలను తగ్గించేలా అభివృద్ధిని సాధిస్తామంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భాజపా దుష్ప్రచారం చేస్తోందని ఎన్నికల సంఘానికి(ఈసీ) కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోపై ఉద్యోగుల్లో, మధ్యతరగతి ప్రజల్లో ఉద్దేశపూర్వకంగానే గందరగోళం సృష్టించడానికి కమలదళం ప్రయత్నిస్తోందని ఆరోపించింది. భాజపాపై చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఆలిండియా ఫ్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌ అధినేత చక్రవర్తి విజ్ఞప్తి చేశారు.

మోదీపై చర్యలకు ఎస్‌కేఎం డిమాండ్‌

సమాజంలోని ఓ వర్గం ప్రజలపై విద్వేషం కలిగించేలా ప్రధాని మోదీ రాజస్థాన్‌ సభలో ప్రసంగించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) డిమాండ్‌ చేసింది. సామరస్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేసినందుకు గాను ఎన్నికల్లో పోటీ చేయకుండా మోదీపై నిషేధం విధించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img