icon icon icon
icon icon icon

భాజపాకు మేలు చేసేలా రాహుల్‌ వ్యాఖ్యలు.. అందుకే ఆయన ‘పాత పేరు’ ప్రస్తావించా

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఉద్దేశించి ‘పాత పేరు’తో ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మంగళవారం సమర్థించుకున్నారు.

Updated : 24 Apr 2024 05:28 IST

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌

కన్నూర్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఉద్దేశించి ‘పాత పేరు’తో ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మంగళవారం సమర్థించుకున్నారు. రాహుల్‌ ఇటీవల ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు భాజపాకు, దర్యాప్తు సంస్థలకు మేలు చేసేవిలా ఉండటంతోనే తానావిధంగా స్పందించాల్సి వచ్చిందన్నారు. ఆయన అలా వ్యవహరించడం పూర్తిగా పరిణతి లేకుండా ఉండటమేనన్నారు. ‘‘అందుకే రాహుల్‌ తన పాత పేరు దిశగా వెళ్లకూడదు’ అని అన్నట్లు విలేకరులతో విజయన్‌ పేర్కొన్నారు. ఈ నెల 19న కేరళలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ మాట్లాడుతూ.. కేరళ సీఎం విజయన్‌ను కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అరెస్టు చేయకపోవడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్‌.అచ్యుతానందన్‌ దశాబ్దం క్రితం రాహుల్‌ గాంధీని ఉద్దేశించి ‘అమూల్‌ బేబీ’ అని పేర్కొనడాన్ని తాను ప్రస్తావించానని విజయన్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img