icon icon icon
icon icon icon

బాంస్‌వాడాలో సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా..

సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన వింత పరిస్థితి రాజస్థాన్‌లోని బాంస్‌వాడాలో కాంగ్రెస్‌కు ఏర్పడింది. తొలుత ఇక్కడ పోటీ చేయాలనే ఉద్దేశంతో పార్టీ అభ్యర్థిగా అరవింద్‌ డామోర్‌ను ప్రకటించింది.

Published : 25 Apr 2024 04:09 IST

బాంస్‌వాడా: సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన వింత పరిస్థితి రాజస్థాన్‌లోని బాంస్‌వాడాలో కాంగ్రెస్‌కు ఏర్పడింది. తొలుత ఇక్కడ పోటీ చేయాలనే ఉద్దేశంతో పార్టీ అభ్యర్థిగా అరవింద్‌ డామోర్‌ను ప్రకటించింది. ఆయన నామినేషన్‌ వేశారు. తర్వాత జరిగిన పరిణామాల్లో భారత్‌ ఆదివాసీ పార్టీతో (బీఏపీ) కాంగ్రెస్‌కు పొత్తు కుదిరింది. దీంతో బాంస్‌వాడా సీటును ఆ పార్టీకి కేటాయించింది. బీఏపీ తరఫున రాజ్‌కుమార్‌ రోత్‌ బరిలోకి దిగారు. నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని డామోర్‌ను కోరగా ఆయన తిరస్కరించి బరిలో ఉన్నారు. దీంతో రోతక్‌ మద్దతుగా, డామోర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ప్రచారం చేయాల్సి వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img