icon icon icon
icon icon icon

ముగిసిన రెండోవిడత ప్రచారం

ఔటర్‌ మణిపుర్‌లోని సగ భాగంతోపాటు దేశవ్యాప్తంగా 88 నియోజకవర్గాల్లో రెండో విడత ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం ముగిసింది.

Published : 25 Apr 2024 04:13 IST

రేపటి పోలింగ్‌కు సర్వం సిద్ధం

దిల్లీ: ఔటర్‌ మణిపుర్‌లోని సగ భాగంతోపాటు దేశవ్యాప్తంగా 88 నియోజకవర్గాల్లో రెండో విడత ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం ముగిసింది. వాస్తవానికి 89 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగాల్సి ఉంది. మధ్యప్రదేశ్‌లోని బైతూల్‌లో బీఎస్పీ అభ్యర్థి మరణించడంతో అక్కడ ఎన్నిక మే 7వ తేదీకి వాయిదా పడింది. శుక్రవారం జరిగే పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది.

  • 2019 ఎన్నికల్లో ఈ 88 సీట్లలో ఎన్డీయే 55 చోట్ల, యూపీఏ 24 చోట్ల గెలిచాయి.
  • పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచీ ఆయా నియోజకవర్గాల్లో స్థానికేతరులు ఉండకూడదని అధికారులు స్పష్టం చేశారు.

ప్రధాన అభ్యర్థులు

రాహుల్‌ గాంధీ, రాజీవ్‌ చంద్ర శేఖర్‌, శశి థరూర్‌, హేమా మాలిని, తేజస్వీ సూర్య, అరుణ్‌ గోవిల్‌, హెచ్‌డీ కుమారస్వామి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img