icon icon icon
icon icon icon

సభలో మాట్లాడుతూ.. కళ్లు తిరిగి పడిపోయిన కేంద్ర మంత్రి గడ్కరీ

లోక్‌సభ ఎన్నికల్లో జోరుగా ప్రచారం కొనసాగిస్తున్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ(66) బుధవారం అస్వస్థతకు గురయ్యారు. తూర్పు మహారాష్ట్రలోని యవత్మాల్‌ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ ఆయన ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయారు.

Published : 25 Apr 2024 04:17 IST

యవత్మాల్‌: లోక్‌సభ ఎన్నికల్లో జోరుగా ప్రచారం కొనసాగిస్తున్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ(66) బుధవారం అస్వస్థతకు గురయ్యారు. తూర్పు మహారాష్ట్రలోని యవత్మాల్‌ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ ఆయన ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో అప్రమత్తమైన మంత్రి రక్షణ సిబ్బంది వెంటనే ఆయన్ను స్టేజ్‌ మీద నుంచి కిందకు తీసుకువెళ్లారు. ప్రథమ చికిత్సను అందించారు. దీంతో కొద్దిసేపటికే కోలుకున్న గడ్కరీ తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఎండ తీవ్రత కారణంగానే అస్వస్థతకు గురైనట్లు ఆయన తెలిపారు. తాను క్షేమంగానే ఉన్నానని.. మరో ర్యాలీలో పాల్గొనేందుకు వరుడ్‌కు బయలుదేరినట్లు వివరించారు. యవత్మాల్‌-వాశిమ్‌ స్థానం నుంచి మహాయుతి కూటమి అభ్యర్థి  రాజశ్రీ పాటిల్‌ తరఫున ప్రచారం చేయడానికి వచ్చిన సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img