icon icon icon
icon icon icon

సంక్షిప్త వార్తలు (6)

అస్సాంలోని సిల్చర్‌, కరీంగంజ్‌ నియోజకవర్గాల్లో చాలామంది ఓటర్లకు ఓటు వేసే అవకాశం లేదు. వారిని విదేశీయుల కింద గుర్తించి ఓటరు కార్డుపై ‘డి’ మార్కు పెట్టారు.

Updated : 25 Apr 2024 06:35 IST

‘డి’ ఓటర్లు

సిల్చర్‌, కరీంగంజ్‌: అస్సాంలోని సిల్చర్‌, కరీంగంజ్‌ నియోజకవర్గాల్లో చాలామంది ఓటర్లకు ఓటు వేసే అవకాశం లేదు. వారిని విదేశీయుల కింద గుర్తించి ఓటరు కార్డుపై ‘డి’ మార్కు పెట్టారు. డి అంటే సంశయాత్మకం (డౌట్‌ఫుల్‌) అని అర్థం. బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన హిందూ బెంగాలీలు బారక్‌ లోయలో స్థిరపడ్డారు. వారందరికీ ఓటు హక్కు వచ్చినా అందులో చాలా మంది ‘డి’ మార్కువల్ల ఓటు వేయలేకపోతున్నారు. రాష్ట్రంలో 96,987 మంది ‘డి’ ఓటర్లున్నారు.


ఓటర్లకు ఆహ్వాన పత్రం

చండీగఢ్‌:  హరియాణాలోని ప్రతి కుటుంబానికీ పెళ్లి కార్డుల తరహాలో ఆహ్వాన పత్రాలను ఈసీ పంపింది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరింది. ‘పోలింగ్‌ రోజున అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం.  50 లక్షల ఆహ్వాన పత్రాలను రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ పంపించాం’ అని తెలిపింది.


రామ రాజ్యం కోసమే

 - అమరావతి, అలప్పుజా సభల్లో అమిత్‌ షా

భాజపాకు ఓటేస్తే అమరవీరులకు వేసినట్లే. అప్పుడే వారు కలలుగన్న రామ రాజ్యం వస్తుంది. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించే జాతి వ్యతిరేకులకు ఓటేయొద్దు. మోదీకి వేసే ప్రతి ఓటూ దేశంలో ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని తుదముట్టించడానికి దోహదం చేస్తుంది. కాంగ్రెస్‌, లెఫ్ట్‌ హయాంలో కేరళలో ఉగ్రవాదం విస్తరించింది. నిషేధిత సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాకు ఆ పార్టీలు మద్దతు పలికాయి.


భాజపా డబ్బులు వెదజల్లుతోంది

- వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ

యనాడ్‌లో రాహుల్‌ గాంధీకి వ్యతిరేకంగా డబ్బును, మీడియాను భాజపా ప్రయోగిస్తోంది. నా సోదరుడిని అవమానించినట్లు దేశంలో ఎవరినీ అవమానించలేదు.భాజపా హయాంలో ధరలు భారీగా పెరిగాయి. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు వచ్చిన మంచి అవకాశం.


ఇండియా కూటమికి నిశ్శబ్ద మద్దతు

- టోంక్‌లో సచిన్‌ పైలట్‌

లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి నిశ్శబ్ద మద్దతు లభిస్తోంది. తొలి విడత పోలింగ్‌ తర్వాత భాజపా వెనుకబడి పోయింది. రాజస్థాన్‌తోపాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లో భాజపాకు వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం కనిపిస్తోంది.  


భాజపా కోసమే 7 విడతలు

- బోల్‌పుర్‌ సభలో మమతా బెనర్జీ

భాజపాకు మేలు చేసేందుకే 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నికలు మే 2, 3 తేదీలకల్లా పూర్తయ్యేవి. కానీ ఈ సారి దాదాపు 80 రోజులపాటు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img