icon icon icon
icon icon icon

సంక్షిప్త వార్తలు (5)

ఓబీసీ కోటా నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్‌ హామీ దేశాన్ని ఇస్లామీకరించడం, విభజించడం దిశగా ముందుకు తీసుకువెళ్లే చర్య.

Updated : 26 Apr 2024 05:57 IST

దేశాన్ని ఇస్లామీకరించడానికే ముస్లిం కోటా

ఓబీసీ కోటా నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్‌ హామీ దేశాన్ని ఇస్లామీకరించడం, విభజించడం దిశగా ముందుకు తీసుకువెళ్లే చర్య. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, బీసీలకు  రాజ్యాంగపరమైన హక్కులను దూరం చేయాలని కాంగ్రెస్‌ కోరుకుంటోంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌


ప్రజల మధ్య చీలికను కోరుకుంటున్న మోదీ

దేశ ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలనుకుంటున్న ప్రధాని మోదీకి వ్యతిరేకంగా విపక్ష ఇండియా కూటమి పోరాడుతోంది. భాజపా పాలనలోని తప్పుడు నిర్ణయాలను సరిదిద్దుతాం. స్వతంత్రంగా వ్యవహరించేలా ఎన్నికల కమిషన్‌ను మార్చాల్సి ఉంది. న్యాయవ్యవస్థ కూడా స్వతంత్రంగా వ్యవహరించేలా చూడాలి.

శ్రీనగర్‌ ఎన్నికల ప్రచారంలో ఎన్‌సీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా


డైనోసర్‌ జాతిలా అంతరించిపోనున్న కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కుటుంబ పెద్ద చనిపోయిన తర్వాత ఆస్తిలో 55 శాతం మాత్రమే వారసులకు వెళ్లేలా చట్టం వస్తుంది. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు త్వరలోనే కనుమరుగవుతాయి. కాంగ్రెస్‌ పార్టీ తీరు చూస్తుంటే త్వరలోనే ఆ పార్టీ డైనోసర్‌ జాతిలా అంతరించిపోతుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌


భాజపాను క్లీన్‌బౌల్డ్‌ చేయండి

వారు(భాజపా) బౌలింగ్‌ చేయలేరు.. బ్యాటింగ్‌ చేయలేరు. మేం ఆరు బంతులకు ఆరు సిక్స్‌లు కొడతాం. ప్రజలంతా భాజపాను క్లీన్‌బౌల్డ్‌ చేయాలి. ఈ ఎన్నికల్లో భాజపా వ్యతిరేక రాజకీయాలకు తెరపడుతుంది. కన్నౌజ్‌ సౌగంధం మళ్లీ గుబాళిస్తుంది.

కన్నౌజ్‌లో నామినేషన్‌ దాఖలు సందర్భంగా ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌


‘మోదీ కీ గ్యారంటీ’ మాయంతో..
అబద్ధాల బాటలో భాజపా

ఉనికిలోకి రాకుండానే ‘మోదీ కీ గ్యారంటీ’ హామీ మాయం కావడంతో భాజపా భయం గుప్పిట్లోకి జారుకుంది. దీంతో ‘సంపద పునఃపంపిణీ’ ‘వారసత్వ పన్ను’ వంటి అంశాలపై తయారు చేసిన వివాదాలను పట్టుకువేలాడుతోంది. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోతో కాషాయ దళం గిలగిల్లాడుతోంది.

దిల్లీలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img