icon icon icon
icon icon icon

అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పన

ఝార్ఖండ్‌లోని గిరిడీహ్‌ జిల్లాకు చెందిన గాణ్డేయ్‌ ఎమ్మెల్యే సర్ఫరాజ్‌ అహ్మద్‌ రాజీనామా చేయడంతో ఆ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో రాష్ట్ర మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పనా సోరెన్‌ బరిలోకి దిగనున్నారు.

Updated : 26 Apr 2024 05:06 IST

రాంచీ: ఝార్ఖండ్‌లోని గిరిడీహ్‌ జిల్లాకు చెందిన గాణ్డేయ్‌ ఎమ్మెల్యే సర్ఫరాజ్‌ అహ్మద్‌ రాజీనామా చేయడంతో ఆ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో రాష్ట్ర మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పనా సోరెన్‌ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ఝార్ఖండ్‌ ముక్తిమోర్చా (జేఎంఎం) గురువారం ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలతోపాటు మే 20న ఈ అసెంబ్లీ స్థానానికి పోలింగ్‌ జరగనుంది. అలాగే జంశెద్‌పుర్‌ లోక్‌సభ స్థానం నుంచి బహరాగోడా సిట్టింగ్‌ ఎమ్మెల్యే సమీర్‌ మొహంతి పోటీ చేస్తారని జేఎంఎం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img