icon icon icon
icon icon icon

దయచేసి వినండి.. ఓటేయడం మరవద్దండి!

లోక్‌సభ ఎన్నికల వేళ ఓటర్లలో చైతన్యం నింపేందుకు కొట్టాయం జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారిణి వి.విఘ్నేశ్వరి విలక్షణ కార్యక్రమం చేపట్టారు.

Published : 26 Apr 2024 04:48 IST

బస్సులు, దుకాణాల్లో ఓటర్లకు కొట్టాయం కలెక్టర్‌ విఘ్నేశ్వరి విజ్ఞప్తి

కొట్టాయం: లోక్‌సభ ఎన్నికల వేళ ఓటర్లలో చైతన్యం నింపేందుకు కొట్టాయం జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారిణి వి.విఘ్నేశ్వరి విలక్షణ కార్యక్రమం చేపట్టారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి వద్దకు వెళ్లి, దుకాణాల వద్ద ప్రజలను కలిసి ఓట్ల పండుగలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్‌ రోజున తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ మేరకు గురువారం నాగపాదంలోని ఓ ప్రైవేటు బస్టాండ్‌లో బస్సుల్లోకి వెళ్లిన కలెక్టర్‌ అక్కడి ప్రయాణికులతో మాట్లాడారు. ‘‘శుక్రవారమే పోలింగ్‌.. మరిచిపోవద్దు. మీ ఓటు హక్కు వినియోగించుకోండి’’ అని కోరారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న చిన్నారులతో ఆమె మట్లాడుతూ.. ‘‘పిల్లలూ.. ఓటు వేయాల్సిందిగా మీ తల్లిదండ్రులకు చెప్పండి’’ అంటూ వారికి చాక్లెట్‌తోపాటు ఓటు గొప్పతనాన్ని తెలియజేసేలా ముద్రించిన ఓ లెటర్‌ను అందించారు. అనంతరం బస్టాండ్‌లోని దుకాణాల వద్దకు వెళ్లి అక్కడ ఉన్నవారితో మాట్లాడారు. అక్కడే బస్సు కోసం వేచిచూస్తున్న కొందరు విద్యార్థినులను ‘మీకు ఓటు హక్కు వచ్చిందా? అని కలెక్టర్‌ ప్రశ్నించారు. అవునంటూ ఆ యువతులు బదులిచ్చారు. దీంతో ‘‘ఓటు వేయడం మరిచిపోవద్దు. మన ప్రజాస్వామ్యానికి మీరే వెన్నెముక. దయచేసి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయండి’’ అని విఘ్నేశ్వరి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img