icon icon icon
icon icon icon

మలబారులో త్రికూట సమరం

సార్వత్రిక ఎన్నికల పోరులో కేరళలో ఎలాగైనా పైచేయి సాధించాలని అధికార వామపక్ష ఎల్‌డీఎఫ్‌, కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌, భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ఉవ్విళ్లూరుతున్నాయి.

Published : 26 Apr 2024 04:49 IST

ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌, ఎన్డీయే మధ్య హోరాహోరీ
కేరళలో అన్ని లోక్‌సభ స్థానాలకూ నేడు పోలింగ్‌

తిరువనంతపురం: సార్వత్రిక ఎన్నికల పోరులో కేరళలో ఎలాగైనా పైచేయి సాధించాలని అధికార వామపక్ష ఎల్‌డీఎఫ్‌, కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌, భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ఉవ్విళ్లూరుతున్నాయి. ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌లు జాతీయస్థాయిలో విపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగమైనా కేరళలో విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. దక్షిణాదిపై ప్రత్యేక దృష్టిపెట్టిన ఎన్‌డీయే సయితం మెరుగైన ఫలితాలకు ఆశపడుతోంది. రాష్ట్రంలోని మొత్తం 20 స్థానాలకూ శుక్రవారం ఒకే దశలో పోలింగ్‌ పూర్తికానుంది. 2019 ఎన్నికల్లో వీటిలో 19 స్థానాలను యూడీఎఫ్‌ గెలుచుకుంటే ఒకే ఒక్కటి ఎల్‌డీఎఫ్‌కు దక్కింది. ఈసారి ఎన్నికల్లో అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన ట్వంటీ20 అనే పార్టీ.. ఎర్నాకుళం, చాలకుడి నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి చోట్ల ఓట్ల చీలిక వల్ల తమకు నష్టం వాటిల్లుతుందేమోనని ప్రధాన పార్టీలు కలవరపడుతున్నాయి. బరిలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో పాటు కేంద్ర మంత్రులు ఇద్దరు, రాష్ట్రమంత్రి ఒకరు, సినీనటులు ముగ్గురు ఉన్నారు. మునుపటి ఎన్నికలతో పోలిస్తే ఈసారి ప్రచారం ఉద్ధృతంగా సాగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img