icon icon icon
icon icon icon

25 వేల నియామకాల రద్దు పూర్తిగా అన్యాయం

పశ్చిమబెంగాల్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రస్థాయి ఎంపిక పరీక్ష -2016 ద్వారా నియమించిన 25వేల మంది బోధన, బోధనేతర సిబ్బందిని తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా అన్యాయమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు.

Updated : 26 Apr 2024 05:45 IST

మమతా బెనర్జీ ధ్వజం

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రస్థాయి ఎంపిక పరీక్ష -2016 ద్వారా నియమించిన 25వేల మంది బోధన, బోధనేతర సిబ్బందిని తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా అన్యాయమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారిని పోలింగ్‌ విధుల నుంచి దూరం చేసేందుకే భాజపా నియామకాల రద్దును చేపట్టిందని తీవ్ర విమర్శలు చేశారు. తద్వారా కమలం పార్టీకి మద్దతు తెలిపే వారికే పోలింగ్‌ కేంద్రాల్లో విధులు కేటాయించనున్నారని ఆరోపించారు. గురువారం పశ్చిమ మేదినీపుర్‌ జిల్లాలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ప్రసంగించారు. ఎవరైనా తప్పు చేసి ఉంటే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, ఇలా ఒకేసారి భారీ సంఖ్యలో ఉద్యోగాల నియామకాన్ని రద్దు చేయడం పూర్తిగా అన్యాయమని మండిపడ్డారు. బోధనా సిబ్బంది లేకుండా పాఠశాలలు ఎలా పనిచేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. సందేశ్‌ఖాలీలో మహిళలపై అన్యాయం జరిగిందంటూ వాపోతున్న ప్రధాని మోదీ గుజరాత్‌, మణిపుర్‌ అల్లర్లలో మహిళలపై జరిగిన అకృత్యాల గురించి ఎందుకు నోరు మెదపడం లేదని దుమ్మెత్తిపోశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img