icon icon icon
icon icon icon

భాజపా 16%, కాంగ్రెస్‌ 13%

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లు పార్లమెంటు ఆమోదముద్రతో చట్ట రూపం సంతరించుకున్నా రాజకీయ పార్టీలు మాత్రం ఆ దారిలో నడవడంలేదు.

Published : 27 Apr 2024 04:55 IST

మహిళలకు సీట్ల కేటాయింపు తీరిది

ఈనాడు, దిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లు పార్లమెంటు ఆమోదముద్రతో చట్ట రూపం సంతరించుకున్నా రాజకీయ పార్టీలు మాత్రం ఆ దారిలో నడవడంలేదు. భాజపా, కాంగ్రెస్‌లు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి మహిళలకు కల్పించిన అవకాశాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. భాజపా ఇప్పటివరకు ప్రకటించిన 436మంది అభ్యర్థుల్లో 70 మంది మహిళలకు, కాంగ్రెస్‌ ప్రకటించిన 317 మంది అభ్యర్థుల్లో 41మంది మహిళలకు సీట్లు కేటాయించాయి. భాజపా    16.05% అబలలకు అవకాశమిస్తే, కాంగ్రెస్‌ 12.93% మందికి లోక్‌సభ ఎన్నికల్లో పోరాడే వీలు కల్పించింది.  బహుశా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావొచ్చన్న అంచనా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img