icon icon icon
icon icon icon

మోదీ భయపడుతున్నారు.. కంటతడి కూడా పెడతారేమో!

ఈ మధ్య ప్రధాని మోదీ ప్రసంగాలు చూస్తుంటే.. ఆయన ఆందోళనగా ఉన్నట్టు కనిపిస్తోందని, రానున్న రోజుల్లో వేదికపై కన్నీరు పెట్టినా పెట్టవచ్చని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు.

Published : 27 Apr 2024 04:56 IST

కర్ణాటక సభల్లో రాహుల్‌

ఈనాడు, బెంగళూరు: ఈ మధ్య ప్రధాని మోదీ ప్రసంగాలు చూస్తుంటే.. ఆయన ఆందోళనగా ఉన్నట్టు కనిపిస్తోందని, రానున్న రోజుల్లో వేదికపై కన్నీరు పెట్టినా పెట్టవచ్చని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. శుక్రవారం కర్ణాటకలోని విజయపుర, బళ్లారి ఎన్నికల సభల్లో మాట్లాడుతూ రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. భాజపాను ‘భారతీయ చొంబు (చెంబు) పార్టీ’గా అభివర్ణించారు. కర్ణాటకకు కేంద్రం నిధులు ఇవ్వలేదన్నందుకు సూచికగా ‘చెంబు’ బొమ్మతో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటనలు ఇస్తున్న విషయం తెలిసిందే. ‘‘తన మాటలతో పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మోదీ మళ్లిస్తున్నారు. కొన్నిసార్లు చైనా, పాకిస్థాన్‌ అంటారు. ఇంకొన్నిసార్లు గిన్నెల శబ్దం చేయమంటారు. మీ ఫోన్లలో టార్చ్‌లైట్‌ ఆన్‌ చేయమని చెబుతారు’’ అంటూ రాహుల్‌ విరుచుకుపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్‌ సర్కారు వస్తే నిరుద్యోగాన్ని రూపుమాపి, ధరలను నియంత్రిస్తామని.. ప్రజలకు న్యాయంగా అందాల్సిన వాటాను అందిస్తామన్నారు. దేశంలో ఒక శాతం వ్యక్తుల వద్ద 40 శాతం సంపద పోగుపడిందని, 70 కోట్ల ప్రజలకు సమానమైన సంపద కేవలం 22 మంది వ్యక్తుల వద్ద ఉండగా మోదీ పేదల సొమ్ము లాక్కొని మళ్లీ వారికే కట్టబెడుతున్నారని తెలిపారు. బిలియనీర్లకు మోదీ ఇచ్చిన ఈ సొమ్మును దేశంలోని పేదలకు తాము పంచుతామన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయా స్థానాల అభ్యర్థులు సభల్లో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img