icon icon icon
icon icon icon

ప్రత్యర్థులకు చురక... ఓటర్లకు వల...

సార్వత్రిక ఎన్నికల సమరంలో డిజిటల్‌ వేదికలూ అభ్యర్థులకు ప్రధాన ఆయుధాలయ్యాయి.

Published : 27 Apr 2024 04:57 IST

సామాజిక మాధ్యమాల్లో మీమ్స్‌ వెల్లువ

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరంలో డిజిటల్‌ వేదికలూ అభ్యర్థులకు ప్రధాన ఆయుధాలయ్యాయి. ప్రచార ఎత్తుగడల్లో భారీ సభలు, ఊరేగింపులు, ఉపన్యాసాలు, ప్రకటనలు ఒక ఎత్తైతే....ప్రత్యర్థులకు సుతిమెత్తగా చురకలువేస్తూ, ఓటర్ల మనసు గెలుచుకునే చమక్కులను విసురుతూ ఆకట్టుకునే చిన్న చిన్న మీమ్స్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. హాస్యోక్తులు, వ్యంగ్య బాణాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు ప్రతివిమర్శలతో కూడిన మీమ్స్‌ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులకు అస్త్రాలుగా మారాయి. రాజకీయ ప్రత్యర్థులపై ఆధిక్యం చాటుకోవడంలో తమదైన కీలకపాత్ర పోషిస్తున్నాయి. అందువల్లే ప్రతి రాజకీయ పార్టీ, వాటి అభ్యర్థులు మీమ్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎన్నికల సంఘం కూడా ఓటర్లను చైతన్యపరచడానికి మీమ్స్‌ను అధికంగా వినియోగించుకుంటోంది. ముఖ్యంగా యువత, తొలిసారి ఓటు వేసే వారిని లక్ష్యంగా చేసుకుని నినాదాల రూపంలో మీమ్స్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తోంది. ‘కొత్త ఓటర్లం..తొలి ఓటుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాం’, ‘మేం సిద్ధం...మరి మీరూ!’ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌తో ఈసీఐ హల్‌చల్‌ చేస్తోంది. సినిమాల్లోని డైలాగులు, నినాదాలను ట్యాగ్‌లైన్‌గా మలచుకుంటోంది. వివిధ వాణిజ్య సంస్థలు కూడా ఎన్నికల ఇతివృత్తంతో సరదా మీమ్స్‌ను వీక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img